Duration 12:46

- ఏ గడప తొక్కినా ఒకటే హామీ..ఎవరిని పలుకరించినా ఒకటే మాట- నారాయణ సార్ మా ఓటు మీకే

31 watched
0
1
Published 10 Nov 2023

- ఏ గడప తొక్కినా ఒకటే హామీ..ఎవరిని పలుకరించినా ఒకటే మాట - నారాయణ సార్ మా ఓటు మీకే -అడక్కుండానే భరోసా ఇస్తున్న నెల్లూరు నగర ప్రజలు -ఆద్యంతం ఆశక్తికరంగా సాగుతున్న మాజీ మంత్రి నారాయణ పర్యటన వెనకాల వస్తున్న కార్యకర్తలను బట్టి కాదు.... స్వచ్చంధంగా వెంట నడుస్తున్న ప్రజలను చూస్తే తెలుస్తుంది ఒక నాయకుడి చరిష్మా ఏంటి అనేది.మాజీ మంత్రి నారాయణ చేపట్టిన నెల్లూరు నగర పర్యటన కు లభిస్తున్న విశేష ప్రజాదరణ చూస్తే తెలుస్తుంది....వారి హృదయాల్లో నారాయణ స్థానం ఏంటి అనేది. నెల్లూరు నగరంలోని డివిజన్లలో పర్యటిస్తున్న నారాయణకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 15వ డివిజన్ పర్యటనలో భాగంగా వచ్చిన నారాయణకు స్థానిక టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ ఖండువాలు కప్పి,శాలువాలతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారస్తులను ఆయన పలకరించగా వ్యాపారంలో కష్టానష్టలను చెప్పుకున్నారు. ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజాలను పలకరించగా ఆప్యాయంగా మాట్లాడారు. ఇంటింటికీ వచ్చి తిరగాల్సిన అవసరం లేదని చెప్పిన ప్రజలు...వారి ఓటు నారాయణ కే వేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగరానికి మంచి భవిష్యత్ ఇవ్వాలనే లక్ష్యంతో భూగర్భ డ్రైనేజి నిర్మించారమని అన్నారు. దీని వలన దోమలు కూడా కనిపించవని చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్త పరిచారు. సంగం నుంచి నెల్లూరు నగరానికి శాశ్వత తాగునీటి పధకం కింద ప్రత్యేక పైప్లైన్ నిర్మించామని అన్నారు. రాష్ట్రంలో దౌర్భాగ్య ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. బలవంతంగా కేసులు పెట్టడం,అన్యాయంగా ఇబ్బంది పెట్టడం తప్ప వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి ఊసే పట్టడం మండిపడ్డారు. పరిపాలన ఇలాగే సాగితే ఏపీ మరో శ్రీలంక గా మారడం ఖాయం అన్నారు.అరాచక పాలన నుంచి త్వరలోనే ప్రజలకు విముక్తి లభిస్తుందని చెప్పిన ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని భరోసా ఇచ్చారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ఒక రౌడీకి అభివృద్ధి ప్రదాతకు మధ్య ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. శాశ్వత తాగునీరు, పార్కులు,రోడ్లు,నెక్లెస్ రోడ్డు..ఇలా చాలా అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. ఎమ్మెల్యే అనిల్ కి మూడు చోట్ల ఓట్లు ఉన్నాయని చెప్తూ ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దొంగ ఓట్లను అధికార పార్టీ నేతలే ప్రోత్సహిస్తున్నారని చెప్తూ...దీనిపై దృష్టి సారించాలని కలెక్టర్ ని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నారాయణ సహకారంతో నెల్లూరు నగరాన్ని చెన్నైకి పోటీగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దొడ్డపునేని రాజనాయుడు, డివిజన్ అధ్యక్షుడు KP పెంచాల చౌదరి ..అంచురు శ్రీనివాసులు నాయుడు,మాజీ కార్పొరేటార్ ఉచ్చి భువనేశ్వరప్రసాద్.. క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, బిఎల్ఎలు.. టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు|| RRR News RRR News ( views of common man ) is a 24 hours Telugu News Channel with Primary Focus to get the Latest News, Debates on views, Breaking News and World wide Updates With its innovative style and investigative journalism to its Viewers. A Leading News Channel providing Live Coverage of International News, Business News, Celebrity News, Political happenings, Crime, Health and Educational News & Sports Updates. #rrrnews #nellorenews #tdp #ysrcp #janasena

Category

Show more

Comments - 0